Share News

ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 131వ స్థానం

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:05 AM

లింగ సమానత్వం సాధించడంలో మనదేశం ఏటేటా వెనకబడుతూనే ఉంది. మహిళలు, పురుషుల మధ్య అవకాశాల్లో అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 131వ స్థానం

న్యూఢిల్లీ, జూన్‌ 12: లింగ సమానత్వం సాధించడంలో మనదేశం ఏటేటా వెనకబడుతూనే ఉంది. మహిళలు, పురుషుల మధ్య అవకాశాల్లో అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక భాగస్వామ్యం నుంచి రాజకీయ సాధికారత వరకు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) గురువారం విడుదల చేసిన ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక-2025లో స్పష్టమైంది. 148 దేశాలకు సంబంధించి ప్రకటించిన లింగ వ్యత్యాస సూచీ ర్యాంకుల్లో భారత్‌ 131వ స్థానంలో నిలిచింది.


గతేడాది 129వ స్థానంలో ఉంది. రాజకీయ సాధికారత, ఆర్థిక భాగస్వామ్యం విషయంలో గణనీయమైన మార్పులతో బంగ్లాదేశ్‌ తన ర్యాంకును 75 స్థానాలు మెరుగుపరుచుకుని 25వ ర్యాంకుని దక్కించుకుంది. మాల్దీవులకు 138వ ర్యాంకు దక్కగా, సూచీలో అట్టడుగున 148వ స్థానంలో పాకిస్థాన్‌ నిలిచింది. ఇక వరుసగా 16వ ఏడాది కూడా ఐస్‌ల్యాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Updated Date - Jun 13 , 2025 | 05:05 AM