Share News

Indus river projects: సింధు జలాల నిల్వకు భారత్‌ రెండు ప్రాజెక్టులు

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:09 AM

సింధు నదీ జలాలను నిల్వ చేసేందుకు భారత్‌ పకుల్దుల్‌, బర్సర్‌ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తోంది. సింధు జలాల ఒప్పందంపై తిరిగి చర్చించేందుకు ప్రభుత్వం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసింది.

Indus river projects: సింధు జలాల నిల్వకు భారత్‌ రెండు ప్రాజెక్టులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: సింధు నదీ జలాలను నిల్వ చేసుకునేందుకుగాను రెండు ప్రాజెక్టులను భారత్‌ నిర్మిస్తోందని సింధు నదీ జల వ్యవహారాల మాజీ కమిషనర్‌, సింధు జలాల ఒప్పందానికి పదేళ్లు టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా పని చేసిన ఏకే బజాజ్‌ తెలిపారు. సింధూ జలాల ఒప్పందంపై రెండేళ్ల క్రితమే తిరిగి చర్చలు జరపడానికి ప్రభుత్వం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసినట్టు ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో బజాజ్‌ తెలిపారు. మరోవైపు సింధు నది వ్యవస్థపై రెండు కొత్త నీటి నిల్వ ప్రాజెక్టుల (పకుల్దుల్‌ ప్రాజెక్టు, బర్సర్‌ ప్రాజెక్టు) పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. పకుల్దుల్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, బర్సర్‌ ప్రాజెక్టు తుది ప్రణాళిక దశలో ఉందని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు సిద్ధమైతే సింధు. దాని ఉప నదుల నుంచి భారత్‌ అవసరానికి అనుగుణంగా నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:09 AM