Indian Air Force: రూ.62వేల కోట్లతో 97 యుద్ధ విమానాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:28 AM
దేశంలో తయారయ్యే తేలికపాటి యుద్ధ విమానా లైట్ కాంబాట్ ఎయిర్‌క్రా్‌ఫ్ట ఎల్‌సీఏలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ..
కొనుగోలుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో తయారయ్యే తేలికపాటి యుద్ధ విమానా (లైట్ కాంబాట్ ఎయిర్‌క్రా్‌ఫ్ట-ఎల్‌సీఏ)లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.62వేల కోట్ల వ్యయంతో ఎల్‌సీఏ మార్క్ 1ఏ తరహాకు చెందిన 97 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని మంగళవారం ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వీటిని రూపొందించనుంది. ఇంతకుముందు రూ.40వేల కోట్ల వ్యయంతో 83 ఎల్‌ఏసీ మార్క్ 1ఏ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఇది రెండో ఆర్డర్ కావడం గమనార్హం. మిగ్-21 యుద్ధ విమానాలకు బదులుగా భారత వాయుసేన వీటిని ఉపయోగించనుంది.