Kailash Mansarovar Yatra: జూన్‌లో మానస సరోవర యాత్ర
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:50 AM
భారత్, చైనా మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కైలాస మానస సరోవర యాత్రను జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 5 సంవత్సరాల విరామం అనంతరం ఈ యాత్ర రెండు మార్గాల్లో చేపట్టబడనుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: హిందువులు, బౌద్ధులు, జైనులు పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్రను జూన్ నెలలో నిర్వహించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అయిదేళ్ల విరామం అనంతరం ఈ యాత్ర మళ్లీ జరగనుంది. తొలుత కరోనా కారణంగా 2020లో ఈ యాత్రను రద్దు చేయగా, అనంతరం తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా నిలిపివేశారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఈ యాత్ర నిర్వహణపై దృష్టి పెట్టారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ యాత్ర జరుగుతుందని శనివారం విదేశీ వ్యహారాల శాఖ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులా పాస్--ఈ రెండు మార్గాల్లో యాత్ర సాగుతుందని పేర్కొంది. ఈ యాత్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దరఖాస్తులను జుఝడ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ద్వారా యాత్రికుల ఎంపిక జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్