Share News

IED blast injures two CRPF: మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:34 AM

మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి సీఆర్‌పీఎఫ్‌ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు...

IED blast injures two CRPF: మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

  • ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఘటన

  • వీరిలో ఒకరిది ములుగు జిల్లా తాడ్వాయి మండలం

చర్ల/తాడ్వాయి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి సీఆర్‌పీఎఫ్‌ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బార్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంద్రావతి నది సమీపంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ‘ఏరియా డామినేషన్‌’ చేస్తుండగా.. మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాతరపై ఓ జ వాను కాలు పెట్టారు. అది వెంటనే పేలిపోవడంతో జవాన్లు దివాన్‌ సింగ్‌, ఆలం మునేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి వారి కాళ్లు తెగిపడినట్లు తెలిసింది. వెంట నే వీరిని మెరుగైన వైద్యం కోసం దంతెవాడకు, అక్కడ నుంచి రాయ్‌పూర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆలం మునేష్‌ స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని భూపతిపురం. మునేష్‌ గాయపడిన విషయం తెలియడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Updated Date - Sep 12 , 2025 | 03:34 AM