Share News

Breast Cancer Risk: రొమ్ము క్యాన్సర్‌కు నాన్‌వెజ్‌, నిద్రలేమే ప్రధాన కారణాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 03:59 AM

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఈ మహమ్మారి బారినపడుతోన్న వారి సంఖ్య ఏటా....

Breast Cancer Risk: రొమ్ము క్యాన్సర్‌కు నాన్‌వెజ్‌, నిద్రలేమే ప్రధాన కారణాలు

  • ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఈ మహమ్మారి బారినపడుతోన్న వారి సంఖ్య ఏటా 5.6ు మేరకు పెరుగుతూ ఏటా కొత్తగా 50 వేల కేసులు నమోదు అవుతున్నాయి. నాన్‌ వెజ్‌, నిద్రలేమి కారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రాసెస్‌ చేసిన మాంసం శరీరంలోని ఈస్ట్రోజన్‌ స్థాయిలను పెంచి క్యాన్సర్‌కు దారితీస్తుందని పేర్కొంది. అలాగే సరిగా నిద్రలేకపోవడం, వేళకు నిద్రపోవకపోవడం, వెలుతురు ఉన్న గదుల్లో నిద్రించడం వల్ల మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి క్యాన్సర్‌కు కారణమౌతున్నట్లు గుర్తించారు. వీటితో పాటు స్థూలకాయం మరో ప్రధాన సమస్యగా మారింది. రెడ్‌ మీట్‌(మటన్‌, ఫోర్క్‌, బీఫ్‌)తో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువేనని గతంలో పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు సర్జికల్‌ ఆంకాలజిస్టు, ఎంఎన్‌జే మాజీ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసులు చెప్పారు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని వేడి చేయడం వల్ల వాటిలో కేన్సర్‌ కారక పదార్ధాలు విడుదల అవుతాయన్నారు. నిద్ర తక్కువగా పోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 03:59 AM