Share News

India vs Pakistan military: ఎవరి బలమెంత?

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:41 AM

భారత వాయుసేన స్క్వాడ్రన్‌ ల సంఖ్య తగ్గడం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. పాక్‌, చైనా కలిసి వస్తే ఎదుర్కొనే స్థితిలో భారత ఆర్మీ ఉండేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.

India vs Pakistan military: ఎవరి బలమెంత?

భారత ఆర్మీ ఆయుధపరంగా, రవాణాపరంగా పాక్‌ ఆర్మీ కంటే చాలా బలమైనది. భారత నౌకాదళంతో పోలిస్తే పాక్‌ నౌకాదళం ఎప్పుడూ చాలా బలహీనమే. అయితే వాయుసేన పరంగా పాక్‌ సంఖ్యాబలంలో వెనకబడి ఉన్నప్పటికీ నాణ్యత, శిక్షణలో భారత్‌ కంటే కొంత ముందంజలో ఉండేది. 1990 తర్వాత భారత్‌ ఆ లోటును చాలావరకూ అధిగమించింది. సుఖోయ్‌ 30, రాఫెల్‌ వంటి విమానాల్ని సమకూర్చుకోవడం ద్వారా పాక్‌కు అందనంత ముందంజలో నిలబడింది. కానీ గత పదేళ్లుగా ఒక్క యుద్ధ విమానాన్నీ కొనుగోలు చేయకపోవడం, ఉన్న విమానాలు పాతబడి రిటైరైపోవడం, స్వదేశీ తేజస్‌ యుద్ధ విమానాల తయారీ నత్తనడకన సాగుతుండడం వల్ల భారత యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోయింది. అటు పాక్‌, ఇటు చైనా రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి భారత్‌ వద్ద 42 స్క్వాడ్రన్ల (ఒక స్క్వాడ్రన్‌ అంటే సుమారుగా 18) యుద్ధ విమానాలు ఉండాలనేది రక్షణ నిపుణుల సిఫారసు. ప్రస్తుతం అది 31 స్క్వాడ్రన్లకు పడిపోయింది. దీనిపై భారత వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్‌ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. క్షిపణులపరంగా పాక్‌ కంటే భారత్‌ చాలా ముందంజలో ఉండడం వల్ల ఈలోటును కొంత అధిగమించవచ్చు. అయితే పాక్‌కు మద్దతిస్తామని చైనా ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం రాని రీతిలో భారత్‌ తన సైనిక, దౌత్య వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి

fgh.jpg


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 04:41 AM