Share News

Heavy Rainfall: కోల్‌కతాలో వరుణుడి బీభత్సం

ABN , Publish Date - Sep 24 , 2025 | 02:47 AM

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నగరవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన..

Heavy Rainfall: కోల్‌కతాలో వరుణుడి బీభత్సం

  • విద్యుదాఘాతంతో పది మంది మృతి

కోల్‌కతా, సెప్టెంబరు 23: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నగరవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోగా.. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతాలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 25.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1986లో కోల్‌కతాలో 25.95 సెం.మీల వర్షపాతం నమోదవ్వగా.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మంగళవారం ఆ స్థాయి వర్షం కురిసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీలకు పైగా వర్షం కురిసిందని ఐఎండీ పేర్కొంది. భారీ వర్షం ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్థాయి వర్షాన్ని మునుపెన్నడూ చూడలేదని సీఎం మమత అన్నారు. మరణాలకు రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా చేస్తున్న ప్రైవేటు సంస్థ సీఈఎ్‌ససీదే బాధ్యతని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు మంగళవారం ప్రకటించారు.

Updated Date - Sep 24 , 2025 | 02:47 AM