Share News

Health Alert: మాస్క్‌ ధరించండి..

ABN , Publish Date - May 22 , 2025 | 05:42 AM

దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకొని హోం ఐసోలేషన్‌లో ఉండాలని, ప్రయాణాల సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.

Health Alert: మాస్క్‌ ధరించండి..

కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరగడంతో ఆరోగ్యశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు హెల్త్‌ డైరెక్టర్‌ పద్మావతి ప్రత్యేక సూచనలు చేస్తూ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రకటనలో చెప్పారు. కొవిడ్‌ నిర్థారణ అయితే హోం ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. బస్సు, రైలు ప్రయాణాలు చేసినప్పుడు మాస్కు ధరించాలని చెప్పారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 05:42 AM