Share News

Haryana: భాక్రా నంగల్‌ జలాల్ని మాకివ్వండి

ABN , Publish Date - May 01 , 2025 | 05:14 AM

సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో, హరియాణాకు తాగునీటి కోసం భాక్రా నంగల్‌ జలాశయ జలాలను విడుదల చేయాలని సీఎం సైనీ పంజాబ్‌ను కోరారు. లేదంటే అదనపు జలాలు పాకిస్థాన్‌కు వెళ్లిపోతాయని హెచ్చరించారు.

Haryana: భాక్రా నంగల్‌ జలాల్ని మాకివ్వండి

రాష్ట్ర తాగునీటి అవసరాలు తీరతాయి

లేదంటే అదనపు నీరు పాక్‌కు వెళ్తుంది

పంజాబ్‌ను కోరిన హరియాణా సీఎం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: భాక్రా నంగల్‌ రిజర్వాయ జలాలను తమ రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని హరియాణా సీఎం నాయబ్‌సింగ్‌ సైనీ పంజాబ్‌ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే అదనపు జలాలు అనవసరంగా పాకిస్థాన్‌కు వెళ్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో సైనీ ఈ అభ్యర్థన చేయడం గమనార్హం. సింధు జలాల ఒప్పందం పరిధిలోకి అతిపెద్ద భాక్రా నంగల్‌ రిజర్వాయర్‌ కూడా వస్తుంది. వర్షాకాలంలోపు ఈ జలాశయంలోని నీటిని ఖాళీ చేయాల్సి ఉందని, అప్పుడే వరద నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సైనీ తెలిపారు. తమ రాష్ట్రానికి తాగునీటి అవసరాలకు నీళ్లివ్వాలని.. లేదంటే అదనపు జలాలు పాకిస్థాన్‌కు వెళ్లడం మినహా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. హరియాణా ఇప్పటికే వాటాకు మించి జలాలను వాడుకుందన్న పంజాబ్‌ ప్రకటనపై స్పందిస్తూ.. అసలు తమకు రావాల్సిన వాటా జలాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదని సైనీ చెప్పారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. చీనాబ్‌, జీలం సహా ఇతర నదుల నీటిని ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:14 AM