Hafiz Saeed: పాక్‌లో హఫీజ్ విలాస జీవితం
ABN , Publish Date - May 01 , 2025 | 05:09 AM
లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తాజా ఫొటోలు, వీడియోల ద్వారా వెల్లడైంది. జైల్లో ఉన్నాడని పాక్ చెబుతున్నా, లాహోర్‌లో భద్రతతో కూడిన ప్రైవేటు నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది.
లాహోర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవనం
బట్టబయలు చేసిన శాటిలైట్ ఫొటోలు, వీడియోలు
లాహోర్, ఏప్రిల్ 30: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయం బట్టబయలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా బయటికి వచ్చాయి. పాకిస్థాన్ ప్రభుత్వం అతనికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించిన విషయం కూడా ఈ ఫొటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. పాకిస్థాన్ రాజధాని లాహోర్‌లో జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే అతడు నివసిస్తున్నాడు. తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కూడా అతడే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. హఫీజ్ సయీద్ నివాసం ఉండే ప్రాంతంలో 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాల్లో మూడు ఆస్తులు కనిపిస్తున్నాయి. వాటిలో ఒక పెద్ద భవనంలో అతడు నివసిస్తున్నాడు. అదే మసీదు. దీంతోపాటు మదరసా, హఫీజ్‌కు వ్యక్తిగత సౌకర్యాలు కల్పించిన ప్రైవేటు పార్కు కూడా ఉన్నాయి. ఆ ప్రైవేటు పార్కు కొత్తగా నిర్మించినది. అతడు జైల్లో ఉన్నాడని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతున్నది అబద్ధమేనని తాజా వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..