PM Modi: సామాన్యులకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగం బలోపేతం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:42 AM
భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. వ్యాపారం మరింత సరళతరమవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఎర్రకోట వేదికగా తాను స్వాతంత్య్ర దినోత్సవాన ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.