CPI Leader Narayana: బిహార్ ఓటమి భయంతోనే జీఎస్టీ సంస్కరణలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:31 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తొమ్మిదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం జీఎ్‌సటీ శ్లాబులను తగ్గించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి...
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తొమ్మిదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం జీఎ్‌సటీ శ్లాబులను తగ్గించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందనుకునే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్‌ఎస్ అవినీతిపై కవిత వ్యాఖ్యలను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ బాధ్యతగా సమాధానం చెప్పాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తారా..? లేదా? అన్న విషయమై బీఆర్‌ఎస్.. స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.