Share News

Grand Udaipur Wedding: మంతెన రామరాజు కుమార్తె వివాహానికి దేశ, విదేశీ సెలబ్రిటీల క్యూ

ABN , Publish Date - Nov 24 , 2025 | 03:40 AM

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు అడ్డా అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం మరో ‘రిచ్‌’ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది...

Grand Udaipur Wedding: మంతెన రామరాజు కుమార్తె వివాహానికి దేశ, విదేశీ సెలబ్రిటీల క్యూ

  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వేడుకలు

  • జూ.ట్రంప్‌, జెన్నిఫర్‌, బీబర్‌, బాలీవుడ్‌ తారల హాజరు

ఉదయ్‌పూర్‌/విజయవాడ, నవంబరు 23: డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు అడ్డా అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం మరో ‘రిచ్‌’ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ సంతతికి చెందిన అమెరికా పారిశ్రామికవేత్త, ఇంజెనెస్‌ ఫార్మాస్యూటికల్స్‌ అధినేత మంతెన రామలింగరాజు కుమార్తె నేత్ర-వంశీ గాదిరాజు(ఎన్‌ఆర్‌ఐ) ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అతిథుల్లో అమెరికా అధ్యక్షుడు కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, గాయని-నటి జెన్నిఫర్‌ లోపెజ్‌, జస్టిన్‌ బీబర్‌, రాంచరణ్‌, హృతిక్‌ రోషన్‌ తదితరులు ఉన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ వివాహ వేడుకల్లో శుక్ర, శనివారాల్లో జెన్నిఫర్‌ లోపెజ్‌, బీబర్‌, కృతి, మాధురి, షాహిద్‌లు తమ ప్రదర్శనలతో అలరించారు. మంతెన రామరాజు విజయవాడలో జన్మించారు. ఉన్నత విద్య కోసం 1984లో అమెరికాకు వెళ్లారు. తర్వాత అక్కడ పలు కంపెనీలు ప్రారంభించారు.

Updated Date - Nov 24 , 2025 | 03:40 AM