Flight Cancellations: విమాన టికెట్లను రద్దు చేసుకుంటే.. 80శాతం రీఫండ్..
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:44 AM
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభావార్త చెప్పనుంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న, రద్దు చేసుకున్న సందర్భాల్లో...
న్యూఢిల్లీ, నవంబరు 23: విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభావార్త చెప్పనుంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న, రద్దు చేసుకున్న సందర్భాల్లో టికెట్ల కోసం చెల్లించిన మొత్తంలో 80ు సొమ్మును ప్రయాణికులకు తిరిగి చెల్లించే విధానంపై కసరత్తు చేస్తోంది. విమానం టేకాఫ్ అయ్యే చివరి 4 గంటల సమయంలో టికెట్ రద్దు చేసుకున్నా ఈ సదుపాయాన్ని అందించాలని భావిస్తోంది. ఈ సదుపాయాన్ని వచ్చే రెండు మూడు మాసాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న విధానంలో విమానం టేకాఫ్ అయ్యే మూడు గంటలకు ముందు.. టికెట్‌ను రద్దు చేసుకున్న వారికి రూపాయి కూడా తిరిగి చెల్లించడం లేదు. కేవలం వైద్య పరమైన అవసరాల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంది.