Share News

GST Reform: జీఎస్టీ తగ్గించలేదా.. డయల్‌ 1915

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:00 AM

జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో తగ్గిన ధరల మేరకే వినియోగదారులకు వస్తు సేవలు లభిస్తున్నాయా? లేదా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం...

GST Reform: జీఎస్టీ తగ్గించలేదా.. డయల్‌ 1915

  • లేదా 88000 01915కి వాట్సాప్‌ చెయ్యండి.. కేంద్రం ప్రత్యేక నెంబర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో తగ్గిన ధరల మేరకే వినియోగదారులకు వస్తు సేవలు లభిస్తున్నాయా? లేదా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు 1915 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌, 88000 01915వాట్సాప్‌ నెంబర్లను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. తగ్గిన ధరల మేరకు వ్యాపారులు వస్తువులను విక్రయించకుంటే వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి లేదా నిర్దేశిత వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేసి తమ ఫిర్యాదులు చేయవచ్చని సూచించింది. ఈ మేరకు ‘సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) ఓ ప్రకటన చేసింది. అలాగే, తమ ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ రీడ్రెసెల్‌ మెకానిజమ్‌(ఐఎన్‌జీఆర్‌ఏఎం) పోర్టల్‌ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫిర్యాదులు చేయవచ్చునని పేర్కొంది. మరోపక్క, ఈ-కామర్స్‌ సంస్థలు తగ్గిన ధరల మేరకే వినియోగదారులకు సరుకులను అందిస్తున్నాయా? లేదా? అన్నదానిపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. ఇక, ప్రజలు అధికంగా వినియోగించే 54 రకాల ఉత్పత్తుల ధరల్లో వచ్చిన మార్పులపై ప్రతి నెలా సీబీఐసీకి నివేదిక సమర్పించాలని జీఎస్టీ అధికారులను ఈ నెల9వ తేదీనే కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు తొలి నివేదికను సెప్టెంబరు 30వ తేదీలోపు సమర్పించాల్సి ఉంది. ఈ 54 రకాల ఉత్పత్తుల్లో వెన్న, షాంపూ, టూత్‌పే్‌స్ట, ఐస్‌క్రీమ్‌, ఏసీ, టీవీ, గ్లూకోమీటర్‌, సిమెంట్‌ ఉన్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 03:00 AM