Government to Simplify FDI Rules: ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత సరళం
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:45 AM
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 100 రోజుల సంస్కరణల ఎజెండాపై కసరత్తు చేస్తోంది. ..
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 100 రోజుల సంస్కరణల ఎజెండాపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు నిబంధనలను సడలించటంతో పాటు స్టార్ట్‌పలకు మరిన్ని పన్ను ప్రయోజనాలను అందించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, తోలు-పాదరక్షల పరిశ్రమలకు పర్యావరణ నిబంధనల సరళీకరణ, ఈ-కామర్స్ హబ్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు నియమావళి సడలింపులు ఉన్నాయన్నారు.