Share News

ABS System: అన్ని టూవీలర్లకు ఏబీఎస్‌..

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:55 AM

ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎ్‌స)ను తప్పనిసరి చే యాలని నిర్ణయించింది.

ABS System: అన్ని టూవీలర్లకు ఏబీఎస్‌..

  • జనవరి నుంచి తప్పనిసరి..టూవీలర్ల ధర 2వేలు పెరిగే చాన్స్‌

న్యూఢిల్లీ, జూన్‌ 20: ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎ్‌స)ను తప్పనిసరి చే యాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125 సీసీ ఇంజన్‌ సామర్థ్యం దాటిన టూవీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్‌ సామర్థ్యంతో సంబంధంలేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్‌ సైకిళ్లకు ఏబీఎ్‌సను తప్పనిసరికానుంది. మరోవైపు కొత్త టూవీలర్లను కొనే సమయంలో రెండు బీఐఎస్‌ సర్టిఫైడ్‌ హెల్మెట్లను వాహనదారులకు టూవీలర్‌ డీలర్లు అందించడాన్ని కూడా త్వరలో మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేయనుంది.


ఇందులో ఒకటి వాహనాన్ని నడిపే వారికి రెండోది వెనుక కూర్చునే వారికి. పై రెండు నిబంధనలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఏబీఎ్‌సను అన్ని కొత్త టూవీలర్లకు అమలు చేయడం వల్ల వీటి ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏబీఎ్‌సను తప్పనిసరి చేయడం వల్ల ఎంట్రీ లెవల్‌ టూవీలర్ల ధర కనీసం రూ.2వేలు పెరగవచ్చన్న అంచనాలున్నాయి. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అనేది సడన్‌గా బ్రేక్‌ వేసిన సమయంలో మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల చక్రాలు లాక్‌ కాకుండా నిరోధిస్తుంది.

Updated Date - Jun 21 , 2025 | 05:55 AM