Share News

Unified Pension Scheme: యూపీఎస్‌ నుంచి ఎన్‌పీఎస్‌కు మరో చాన్స్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:28 AM

కొత్తగా ప్రవేశ పెట్టిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎ్‌స)లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీరు ఈ పథకం నుంచి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎ్‌స)లోకి మారేందుకు అవకాశం కల్పించింది.

Unified Pension Scheme: యూపీఎస్‌ నుంచి ఎన్‌పీఎస్‌కు మరో చాన్స్‌

న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశ పెట్టిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎ్‌స)లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీరు ఈ పథకం నుంచి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎ్‌స)లోకి మారేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇలా మారే అవకాశం ఒకసారికి మాత్రమే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ఎన్‌పీఎ్‌సలోని ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి యూపీఎ్‌సకు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలాఖరు వరకు ఈ ఆప్షన్‌ ఉంటుంది. గత నెల 20 నాటికి దాదాపు 31,555 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎ్‌స నుంచి యూపీఎ్‌సకు మారారు. కావాలనుకుంటే వీరు మళ్లీ ఎన్‌పీఎ్‌సకు మారవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - Aug 26 , 2025 | 01:28 AM