Share News

No Foster Care for Children Under Six: ఆరేళ్లలోపు పిల్లలను తాత్కాలిక సంరక్షణకు తీసుకోరాదు

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:52 AM

అనాథ పిల్లలను తాత్కాలిక సంరక్షణకు స్వీకరించేందుకు సంబంధించిన నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆరేళ్లలోపు పిల్లలను తాత్కాలిక సంరక్షణ..

No Foster Care for Children Under Six: ఆరేళ్లలోపు పిల్లలను తాత్కాలిక సంరక్షణకు తీసుకోరాదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: అనాథ పిల్లలను తాత్కాలిక సంరక్షణకు స్వీకరించేందుకు సంబంధించిన నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆరేళ్లలోపు పిల్లలను తాత్కాలిక సంరక్షణ (ఫోస్టర్‌ కేర్‌)కు స్వీకరించకూడదని తెలిపింది. తాత్కాలిక సంరక్షణ విషయమై జువెనైల్‌ జస్టిస్‌ రూల్స్‌లోని నిబంధన నెంబరు 23(3), తాత్కాలిక సంరక్షణ మార్గదర్శకాల్లోని పాయింట్‌ నెంబరు 4(1)కి రకరకాలుగా భాష్యాలు చెబుతున్న నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. ఏయే సందర్భాల్లో పిల్లలను తాత్కాలిక సంరక్షణకు స్వీకరించవచ్చో అన్నదాన్ని జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని రూల్‌ నెంబరు 44లో వివరించారని, వాటిని పాటిస్తూ ఆరేళ్లు, అంతకుపైబడ్డ వయసు ఉన్నవారినే స్వీకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు దత్తత వ్యవహరాలను పర్యవేక్షించే సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) రాష్ట్ర, జిల్లా స్థాయి సంస్థలకు సమాచారం పంపించింది. మరోవైపు, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు, అందుకు సంబందించిన కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రూపొందించాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Updated Date - Sep 25 , 2025 | 03:52 AM