Sabarimala Sparks Controversy: శబరి ఆలయంలో ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడం తొలగింపు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:04 AM
శబరిమలలోని అయ్యప్ప ఆలయం వివాదంలో చిక్కుకొంది. సన్నిధానంలోని ద్వార పాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం రేకులను తొలగించడంపై...
కోచి, సెప్టెంబరు 12: శబరిమలలోని అయ్యప్ప ఆలయం వివాదంలో చిక్కుకొంది. సన్నిధానంలోని ద్వార పాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం రేకులను తొలగించడంపై ఆరోపణలు వచ్చాయి. చంద్రగ్రహణం పేరుతో విగ్రహాలకు ఉన్న బంగారు రేకులను తొలగించి అక్రమ రవాణా చేశారన్న ప్రచారం జరిగింది. ఏకంగా ద్వారపాలక విగ్రహాలనే తొలగించారన్న వదంతులు కూడా వ్యాపించాయి. వీటిపై కేరళ హైకోర్టు తనకుతానుగా సుమోటో విచారణ చేపట్టింది. బంగారు తాపడం పనులకు సంబంధించిన మొత్తం రికార్టులను స్వాధీనం చేసుకోవాలని శుక్రవారం ఆదేశించింది. శబరిమల ఆలయ స్పెషల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండా విగ్రహాలకు ఉన్న బంగారు పూత పూసిన రాగి రేకులు తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించింది.