Kerala Minister VN Vasavan: సెప్టెంబరులో ప్రపంచ అయ్యప్ప భక్తులతో సభ
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:41 AM
శబరిమల చరిత్రలోనే తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులతో పంపాబేస్ వద్ద సెప్టెంబరులో సభను ఏర్పాటు చేయనున్నట్లు కేరళ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు.
పతనంతిట్ట, జూన్ 26: శబరిమల చరిత్రలోనే తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులతో పంపాబేస్ వద్ద సెప్టెంబరులో సభను ఏర్పాటు చేయనున్నట్లు కేరళ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. ఓనం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, రాబోయే మండల, మకరవిళక్కు సీజన్ సందర్భంగా అయ్యప్ప భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షిస్తామన్నారు. గురువారం ఆయన శబరిమలపై ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం పినరయి విజయన్‌తోపాటు ప్రముఖులు ఈ సభలో పాల్గొంటారని వివరించారు.