Share News

Giriraj Singh: నమ్మక ద్రోహులైన మైనారిటీల ఓట్లు అక్కర్లేదు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:00 AM

మైనారిటీలంతా నమ్మక ద్రోహులని కేంద్ర చేనేతశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆరోపించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మక ద్రోహులైన మైనారిటీల....

Giriraj Singh: నమ్మక ద్రోహులైన మైనారిటీల ఓట్లు అక్కర్లేదు

  • కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

పట్నా, అక్టోబరు 19: మైనారిటీలంతా నమ్మక ద్రోహులని కేంద్ర చేనేతశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆరోపించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మక ద్రోహులైన మైనారిటీల ఓట్లక్కర్లేదని ఆర్వార్‌ జిల్లాలో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేనొకసారి మౌల్వీ (ముస్లిం మత పెద్ద)ను ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా కార్డు కలిగి ఉన్నారా? అని అడిగితే.. అవును తీసుకున్నానని చెప్పారు. ఆ కార్డులు హిందూ-ముస్లింల ప్రాతిపదికన పంపిణీ చేశారా అంటే లేదన్నారు. మరి నాకు ఓటేశావా..? దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతావా? అంటే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ముస్లింలు లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం వేయరు. అటువంటి వారంతా నమ్మక ద్రోహులు. అటువంటి నమ్మక ద్రోహుల ఓట్లు మాకు అక్కర్లేదని మౌల్వీకి చెప్పాను’ అని గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మంత్రికి వాక్‌ స్వాతంత్య్రం ఉందన్న ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌.. ఆయన భాష ఆందోళనకరమన్నారు.

Updated Date - Oct 20 , 2025 | 04:00 AM