Generation Z Protesters: రాజ్యాంగాన్ని తిరగ రాయాల్సిందే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:48 AM
దేశంలో భారీ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని, వ్యవస్థలను మార్చాలని జెనరేషన్ జెడ్ ఆందోళనకారులు...
దేశంలో భారీ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని, వ్యవస్థలను మార్చాలని జెనరేషన్ జెడ్ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆందోళనకారులు అమరవీరులని, వారి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని పేర్కొన్నారు. నిరుద్యోగం, వలసలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆందోళనకారులు ప్రధానంగా ఆరు డిమాండ్లు పెట్టారు. అవి.. ప్రస్తుతమున్న ప్రజాప్రతినిధులు వెంటనే చట్టసభలన్నీ రద్దు చేయాలి. పారదర్శకంగా, స్వతంత్రంగా ఎన్నికలను నిర్వహించాలి. ప్రజలు నేరుగా ఎన్నుకునే వ్యక్తి ప్రభుత్వాధినేతగా ఉండాలి. పౌరులు, నిపుణులు, యువతకు భాగస్వామ్యం ఉండేలా రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాయాలి. అక్రమ ఆస్తులన్నీ జాతీయం చేయాలి. విద్య, ఆరోగ్యం, న్యాయం, భద్రత, సమాచార వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేయాలి.