Gas Pipeline Leak: యానాంలో గ్యాస్ పైప్‌లైన్ లీక్
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:59 AM
కాకినాడ, కోనసీమ జిల్లాల సరిహద్దు, పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానాం సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లిన ఓఎన్జీసీ గ్యాస్‌పైప్‌లైన్ శుక్రవారం తెల్లవారుజామున ...
ఎగసిన మంటలు.. ఎరుపెక్కిన ఆకాశం
కిలో మీటరు మేర మడ అడవులు అగ్నికి ఆహుతి
భయభ్రాంతులకు గురైన స్థానికులు
యానాం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కాకినాడ, కోనసీమ జిల్లాల సరిహద్దు, పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానాం సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లిన ఓఎన్జీసీ గ్యాస్‌పైప్‌లైన్ శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటలకు లీక్ అవ్వడంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశం ఎరుపెక్కింది. 40 అడుగుల మేర మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఓఎన్జీసీ, యానాం పరిపాలనాధికారి, పోలీసులతో మాట్లాడి తక్షణం సంఘటన ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఓఎన్జీసీ సేఫ్టీ అధికారులు పైప్‌లైన్ నుంచి వచ్చే గ్యాస్‌పైప్ వాల్‌ను సముద్రంలోనే మూసివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘట ప్రాంతానికి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ టీమ్ సాహసోపేతంగా వెళ్లింది. అక్కడ నీటి నుంచి బుడగల రూపంలో నీరు పొంగడంతో పాటు సమీపంలోని మడ అడవులు కిలోమీటరు మేర అగ్నికి ఆహుతయ్యాయి.