Former IPS Officer: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మాజీ ఐపీఎస్ ఆత్మహత్య
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:41 AM
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ మాజీ ఐపీఎస్ అధికారి సోమవారం ప్రాణాలు తీసుకున్నారు. పంజాబ్ ఐజీగా పనిచేసిన అమర్ సింగ్ చహాల్ తన సెక్యూరిటీ....
రూ.8 కోట్ల మేర నష్టం.. తుపాకీతో కాల్చుకొని మృతి
పటియాలా, డిసెంబరు 22: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ మాజీ ఐపీఎస్ అధికారి సోమవారం ప్రాణాలు తీసుకున్నారు. పంజాబ్ ఐజీగా పనిచేసిన అమర్ సింగ్ చహాల్ తన సెక్యూరిటీ గార్డు చేతిలోని రైఫిల్ లాక్కొని ఆత్మహత్య చేసుకున్నారు. వెల్త్ మేనేజ్‌మెంట్ అడ్వైజర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయనను రూ.8.10 కోట్ల మేర మోసగించారు. ఆత్మహత్యకు ముందు ఆయన మోసం జరిగిన తీరును వివరిస్తూ డీజీపీ గౌరవ్ యాదవ్‌కు 12 పేజీల లేఖ రాశారు. ఎఫ్-777 డీబీఎస్ వెల్త్ ఈక్విటీ రీసెర్చ్ గ్రూపు పేరుతో డీబీఎస్ బ్యాంకు, ఆ బ్యాంకు సీఈఓ పేరుతో మోసగించారని ఆ లేఖలో తెలిపారు. తన కుటుంబాన్ని నాశనం చేయడంతో పాటు, పంజాబ్ పోలీసులకు కూడా మచ్చతెచ్చానని ఆ లేఖలో బాధపడ్డారు. తన దగ్గర ఎలాంటి ఆయుధం లేనందునే గన్‌మ్యాన్ చేతిలోని రైఫిల్‌ను లాక్కొన్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు.