Chevella Road Accident: చేవెళ్ల ప్రమాదంలోడ్రైవర్లు మద్యం తీసుకోలేదు
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:23 AM
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్, బస్సుల డ్రైవర్లు ఎలాంటి మద్యం తీసుకోలేదని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షల్లో...
ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడి
చేవెళ్ల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్, బస్సుల డ్రైవర్లు ఎలాంటి మద్యం తీసుకోలేదని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షల్లో బయపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ గ్రామ సమీపంలో ఈనెల 3న ఆర్టీసీ బస్సును టీప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 34 మందికి గాయాలైన విషయం విదితమే. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌దాన్య కమల్ (24), బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా (31)లు మద్యం సేవించారా? అనే కోణంలో వారి మృతదేహాలను పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి (ఎఫ్‌ఎ్‌సఎల్) పంపించారు. డ్రైవర్లు మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని ఆ పరీక్షల్లో తేలిందని చేవెళ్ల ఏసీపీ కిషన్‌గౌడ్ శనివారం స్పష్టం చేశారు. ఇంకా వెహికిల్స్ కండిషన్‌కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని ఏసీపీ పేర్కొన్నారు.