Share News

Attend Reception Virtually: విమానం రద్దు.. వర్చువల్‌గా రిసెప్షన్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:21 AM

విమాన సర్వీసు రద్దుతో ఓ నవదంపతులకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో వారి వివాహ రిసెప్షన్‌కు బంధువులు...

Attend Reception Virtually: విమానం రద్దు.. వర్చువల్‌గా రిసెప్షన్‌

  • నవజంటకు అనూహ్య పరిస్థితి

బెంగళూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విమాన సర్వీసు రద్దుతో ఓ నవదంపతులకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో వారి వివాహ రిసెప్షన్‌కు బంధువులు అందరూ హాజరైనా నవదంపతులు మాత్రం రాలేకపోయారు. చివరకు వర్చువల్‌గా హాజరై మమ అనిపించారు. ఇండిగో విమానం రద్దుతో వారు భువనేశ్వర్‌లో చిక్కుకుపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసే సంగమ్‌ దాస్‌, మేఘా క్షీరసాగర్‌కు నవంబరు 23న భువనేశ్వర్‌లో వివాహమైంది. ఈనెల 3న వధువు స్వస్థలం హుబ్బళ్లిలోని గుజరాత్‌ భవన్‌లో భారీ ఖర్చుతో రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశా రు. ఈ రిసెప్షన్‌కు రావడానికి ఈనెల 2న భువనేశ్వర్‌, బెంగళూరు, హుబ్బళ్లి రూట్‌లో వధూవరులు ఇండిగో విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇదే సమయంలో ఇండిగోలో నిర్వహణ సంక్షోభం తలెత్తడంతో వారి విమా న సమయం పలుమార్లు వాయిదా పడి చివరికి రద్దయింది. వారు వచ్చేందుకు వేరే దారి లేకపోవడంతో రిసెప్షన్‌ హాల్‌లో పెద్ద స్ర్కీన్‌ ఏర్పాటు చేయడంతో వీడియో కాల్‌ ద్వారా వేడుకకు హాజరయ్యారు. స్ర్కీన్‌పై కనిపిస్తున్న నవజంటను బంధువులు ఆశీర్వదించారు.

Updated Date - Dec 06 , 2025 | 04:21 AM