Share News

FASTag Annual Pass: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ రికార్డు

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:47 AM

జాతీయ రహదారి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ...

FASTag Annual Pass: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ రికార్డు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు అనూహ్యమైన ప్రజాదరణ లభించింది. నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ పాస్‌ వల్ల జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రె్‌సవేలో ప్రయాణించే వారికి వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 02:47 AM