Share News

BSF Recruitment: మాజీ అగ్నివీర్‌లకు బీఎస్ఎఫ్‌లో 50శాతం రిజర్వేషన్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:42 AM

బీఎస్ఎఫ్‌ కానిస్టేబుళ్ల భర్తీలో మాజీ అగ్నివీర్‌లకు ప్రస్తుతం ఉన్న 10ు రిజర్వేషన్లను కేంద్ర హోం శాఖ 50శాతానికి పెంచింది.

BSF Recruitment: మాజీ అగ్నివీర్‌లకు బీఎస్ఎఫ్‌లో 50శాతం రిజర్వేషన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 20: బీఎస్ఎఫ్‌ కానిస్టేబుళ్ల భర్తీలో మాజీ అగ్నివీర్‌లకు ప్రస్తుతం ఉన్న 10ు రిజర్వేషన్లను కేంద్ర హోం శాఖ 50శాతానికి పెంచింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ జనరల్‌ డ్యూటీ కేడర్‌ (నాన్‌ గెజిటెడ్‌) భర్తీ నిబంధనలు-2015లో సవరణలు చేస్తూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. భర్తీలో మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. మొదటి బ్యాచ్‌ అగ్నివీర్‌లకు అయిదేళ్ల పాటు, మిగిలిన బ్యాచ్‌ల వారికి మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది. ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లు జరపాల్సిన పనిలేదని కూడా పేర్కొంది. ప్రతి ఏటా జరిగే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో 50 శాతం పోస్టులు మాజీ అగ్నివీర్‌లకు, 10 శాతం మాజీ సైనికులకు, 3 శాతం పోస్టులు కంబాటిసైడ్‌ కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)లకు రిజర్వు చేసింది.

Updated Date - Dec 21 , 2025 | 06:43 AM