Sonam Wangchuk : సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:35 AM
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్‌లో హింసకు ఆయనే కారణమని, యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని...
ఎన్‌ఎ్‌సఏ చట్టం కింద అదుపులోకి
లద్దాఖ్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్‌లో హింసకు ఆయనే కారణమని, యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కారణంతో తనను అరెస్టు చేస్తే సంతోషమని వాంగ్‌చుక్ గురువారం ప్రకటించారు. ఈ క్రమంలో మర్నాడే అంటే శుక్రవారమే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం. డీజీపీ ఎస్డీ సింగ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకుంది. కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎ్‌సఏ) కింద ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ చట్టం కింద అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టం. అరెస్టు అనంతరం ఆయనను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. వాంగ్‌చుక్ అరెస్టును జమ్మూకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. వాంగ్‌చుక్ అరెస్టు అన్యాయమని కాంగ్రెస్ పేర్కొంది. ఆయన్ను అరెస్టు చేసి తప్పు చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ అన్నారు. వాంగ్‌చుక్ అరెస్టును ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆప్ అధినేత కేజ్రీవాల్ అభివర్ణించారు.