Indian Institute of Technology: గాలి, నీరుతో విద్యుత్ ఉత్పత్తి..
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:31 AM
సూర్యరశ్మి, బ్యాటరీ.. ఇవేమీ అవసరం లేకుండా కేవలం గాలి, నీరుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఐఐటీ ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరం ద్వారా...
ప్రత్యేక పరికరం తయారుచేసిన ఐఐటీ ఇండోర్ పరిశోధకులు
ఇండోర్, సెప్టెంబరు 3: సూర్యరశ్మి, బ్యాటరీ.. ఇవేమీ అవసరం లేకుండా కేవలం గాలి, నీరుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఐఐటీ ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరం ద్వారా చిన్న ఎలాట్రానిక్ పరికరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించవచ్చని వారు తెలిపారు. గ్రాఫేట్ ఆక్సైడ్‌ను జింక్-ఇమిడాజోల్‌తో కలిపి ప్రత్యేకంగా రూపొందించిన ఒక పొరలాంటి పరికరాన్ని అభివృద్ధి చేశామని ఐఐటీ ఇండోర్ అధికారులు బుధవారం పేర్కొన్నారు. ఈ పొర పాక్షికంగా నీటిలో మునిగినప్పుడు నీరు సూక్ష్మదర్శిని మార్గాల ద్వారా పైకి ప్రవహించి ఆవిరైపోతుందని, ఈ బాష్పీభవన ప్రక్రియ ఆధారిత కదలిక.. పొర చివరన సానుకూల, ప్రతికూల అయాన్లను వేరు చేసి.. స్థిరమైన వోల్టేజ్‌ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. మూడు సెంటీమీటర్ల పొడవు, రెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ పొర 0.75 వాట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయగలదని, అయితే ఎక్కువ పొరలను కలపడం ద్వారా అధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని వారు తెలిపారు.