ED Issues to Kerala CM: మసాలా బాండ్ల కేసులో కేరళ సీఎంకు నోటీసులు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:33 AM
ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి నిధులు సేకరణకు ఉద్దేశించిన ‘మసాలా బాండ్లు’ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ కేరళ సీఎం విజయన్‌కు ఈడీ....
న్యూఢిల్లీ, డిసెంబరు 1: ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి నిధులు సేకరణకు ఉద్దేశించిన ‘మసాలా బాండ్లు’ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ కేరళ సీఎం విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామన్ ఇస్సాక్, సీఎం ఆఫీస్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎం.అబ్రహాంలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు సోమవారం అధికార వర్గాలు తెలిపాయి. అయితే, విచారణ నిమిత్తం వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన పనిలేదని తెలిపాయి. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వె్‌స్టమెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎ్‌ఫబీ) కోసం 2019లో రూ.2,150 కోట్లను బాండ్ల రూపంలో సేకరించారు. అందులో రూ.466 కోట్ల వినియోగంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఈడీ నోటీసులు పంపించింది.