Share News

Betting app case: బెట్టింగ్‌ యాప్‌ కేసులో యువీ, సోనూసూద్‌ ఆస్తుల జప్తు

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:19 AM

బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఉతప్పతో పాటు బాలీవుడ్‌ నటులు సోనూసూద్‌...

Betting app case: బెట్టింగ్‌ యాప్‌ కేసులో యువీ, సోనూసూద్‌ ఆస్తుల జప్తు

  • జాబితాలో రాబిన్‌ ఉతప్ప, నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి కూడా..

  • రూ.7.9 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 19: బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఉతప్పతో పాటు బాలీవుడ్‌ నటులు సోనూసూద్‌, నేహాశర్మ ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ జాబితాలో ఊర్వశి రౌతేలా తల్లి, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్‌ హజ్రా కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వీరిని ఈడీ విచారించగా.. తాజాగా రూ.7.9 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వాటిలో యువీకి చెందిన రూ.2.5 కోట్లు, ఊర్వశి రౌతేలా తల్లికి సంబంధించిన 2.02 కోట్లు, నేహా శర్మ 1.26 కోట్లు, సోనూసూద్‌ కోటి, మిమి చక్రవర్తి 59 లక్షలు, హజ్రా 47 లక్షలు, రాబిన్‌ ఉతప్పకు చెందిన రూ.8.26 లక్షల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ యాప్‌లతో ముడిపడి ఉన్న ఈ మనీ లాండరింగ్‌ కేసు విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 1ఎక్స్‌బెట్‌ యాప్‌ నిర్వాహకులపై పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌లకు చెందిన రూ.11.16 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే..

Updated Date - Dec 20 , 2025 | 04:19 AM