Share News

ED investigation: ఫిట్‌జీలో నిధుల దారి మళ్లింపు

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:39 AM

ఈడీ, ఫిట్‌జీ కోచింగ్ సంస్థపై రూ.200 కోట్లపై చిలుకు నిధులను దారి మళ్లించడంపై ఆరోపణలు చేసింది. 14,411 విద్యార్థుల నుండి రూ.250.2 కోట్ల ఫీజులు వసూలు చేసి, వారికి శిక్షణ అందించకపోవడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ED investigation: ఫిట్‌జీలో నిధుల దారి మళ్లింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ప్రముఖ కోచింగ్‌ సంస్థ ‘ఫిట్‌జ్జీ’.. ఒక క్రమ పద్ధతిలో రూ.200 కోట్లపై చిలుకు నిధులను దారి మళ్లించిందని ఈడీ ఆరోపించింది. ‘2025-26 నుంచి 2028-29 వరకూ నాలుగు విద్యా సంవత్సరాలకు కోచింగ్‌ అందిస్తామని దేశవ్యాప్తంగా 14,411 మంది విద్యార్థుల నుంచి సుమారు రూ.250.2 కోట్ల ఫీజులు వసూలు చేసింది. కానీ, వారికి శిక్షణ అందించలేదు‘ అని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఫిట్‌జీ 32 కోచింగ్‌ కేంద్రాలను ఇటీవల అర్ధంతరంగా మూసేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదులతో ఫిట్‌జీపై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:39 AM