DK Shivakumar: కార్యకర్తగా చెత్త ఊడ్చా...పార్టీ జెండా కట్టా
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:18 AM
తాను వేదికలెక్కి ప్రసంగాలు చేయలేదని, కాంగ్రెస్ కార్యకర్తగా చెత్త ఊడ్చానని, పార్టీ జెండా కట్టానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
నేను జీవితకాలం పార్టీ కార్యకర్తను: శివకుమార్
బెంగళూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తాను వేదికలెక్కి ప్రసంగాలు చేయలేదని, కాంగ్రెస్ కార్యకర్తగా చెత్త ఊడ్చానని, పార్టీ జెండా కట్టానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. బెంగళూరు సదాశివనగర్‌లో ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను గురువారం కలిసిన తర్వాత శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ...తాను పార్టీ కార్యకర్తగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నానన్నారు. డీసీఎం పదవితో సంతృప్తిగా ఉన్నానని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అవును నేను జీవితకాలం పార్టీ కార్యకర్తను’ అంటూ కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలో అన్నీ చేశానని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడితో నాయకత్వ మార్పు అంశమై మాట్లాడారా అనే ప్రశ్నకు...ఎటువంటి విషయాలపైనా చర్చించలేదని, అటువంటి అవసరం కూడా లేదని తెలిపారు. ‘మీ శ్రమకు ఫలితం లభిస్తుందా’ అనే ప్రశ్నకు మీడియా అడిగిన అన్నింటికీ సమాధానాలు చెప్పలేమంటూ దాటవేశారు.