Share News

Karnataka Deputy CM DK Shivakumar: బీజేపీ ఉపముఖ్యమంత్రి పోస్టు ఆఫర్‌ చేసింది

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:58 AM

ఆరేళ్లక్రితం కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.....

Karnataka Deputy CM DK Shivakumar: బీజేపీ ఉపముఖ్యమంత్రి పోస్టు ఆఫర్‌ చేసింది

  • వద్దంటే జైలుకు పంపుతామన్నారు: డీకే శివకుమార్‌

బెంగళూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆరేళ్లక్రితం కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తనకు ఉపముఖ్యమంత్రి ఆఫర్‌ ఇచ్చారని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు. దీనికి అంగీకరించకపోతే జైలుకు పంపుతామని బెదిరించారని, తాను పదవికి ఆశపడకుండా జైలుకే వెళ్లానని అన్నారు. స్థానిక ఎఫ్‌కేసీసీఐ ఆడిటోరియంలో కేఎం రఘు రచించిన ‘ఏ సింబల్‌ ఆఫ్‌ లాయల్టీ.. డీకే శివకుమార్‌’ అనే పుస్తకాన్ని బుధవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కాంగ్రె్‌సకు విధేయుడనని పేర్కొన్నారు. ఒకవేళ ఆనాడు తాను ఉప ముఖ్యమంత్రి పదవికి ఆశపడి ఉంటే రాష్ట్ర రాజకీయ చిత్రమే సంపూర్ణంగా మారిపోయి ఉండేదన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 04:00 AM