DK Shivakumar: నేషనల్ హెరాల్డ్ కేసులో డీకేకు నోటీసులు
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:07 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు సమర్పించాలని కోరుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు మాజీ.....
బెంగళూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు సమర్పించాలని కోరుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్టోబరు 3న దాఖలైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి శివకుమార్ వద్ద కీలక సమాచారం ఉందని భావిస్తూ ఆర్థిక నేరాల విభాగం నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత సమాచారం, కాంగ్రె్‌సతో సంబంధాలు, నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు ఎలా ఇచ్చారనే అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తేదీలోపు హాజరు కావాలనీ, లేదంటే సమాచారం ఇవ్వాలని సూచించారు.