Share News

Cold Start Doctrine: కోల్డ్‌ స్టార్ట్‌ అంటే

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:35 AM

పాక్‌కు అణుదాడికి కారణం ఇవ్వకుండా, తక్కువ సమయంలో పరిమిత లక్ష్యాల కోసం దాడి చేయాలనే వ్యూహమే కోల్డ్‌ స్టార్ట్‌. అయితే ఈ సైనిక వ్యూహంలో దౌత్యపరమైన ప్రణాళికలు లేకపోవడం కీలక లోపంగా కనిపిస్తోంది.

Cold Start Doctrine: కోల్డ్‌ స్టార్ట్‌  అంటే

ణ్వస్త్రాలు ప్రయోగించేందుకు తగిన పెద్ద కారణాన్ని పాకిస్థాన్‌కు కల్పించకుండా తక్కువ సమయంలో సైన్యాన్ని మోహరించి పాక్‌పై పరిమిత దాడులు చేసి కొన్ని పరిమిత లక్ష్యాల్ని సాధించడం. పాక్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి పాక్‌ ఉగ్రవాద చర్యలకు పాల్పడినా మనం ఊరుకోవాల్సిందేనా? అని పార్లమెంటుపై దాడి తర్వాత భారత వ్యూహకర్తలు ఆలోచించి ఈ డాక్ట్రిన్‌ను రూపొందించారు. భారత్‌పై అణ్వస్త్ర ప్రయోగం చేయాలంటే అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనే దానిని కూడా పాక్‌ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల భారత్‌పై అణు దాడికి తగిన పెద్ద కారణమేదీ చూపే అవకాశం పాక్‌కు ఇవ్వకుండా పాక్‌పై కొంతమేర దాడులు ఎలా చేయాలి? ఏయే ప్రాంతాల్లో దాడులు చేయాలి? అనే అంశాల్ని మన వ్యూహకర్తలు ఈ కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌లో పొందుపరిచారు.


అయితే మనం పరిమిత దాడులే అని భావించినా, అంతర్జాతీయ సమాజం వాటిని ఎలా చూస్తుంది? అవి పరిమిత దాడులే కదా అని ఊరుకుంటుందా? లేదా తీవ్ర దాడులని భావించి పాక్‌ అణు ప్రయోగానికి పరోక్ష ఆమోదం తెలుపుతుందా? అనేది కీలకం. ఈ విషయంలో భారత దౌత్యవేత్తల పాత్ర చాలా ప్రధానమైనది. భారత్‌ చేస్తున్న దాడులు ఆత్మ రక్షణ కోసం చేస్తున్న పరిమిత దాడులేనని ముఖ్య దేశాలను వారు కన్విన్స్‌ చేయాల్సి ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత కోల్డ్‌స్టార్ట్‌ డాక్ట్రిన్‌ అనేది కేవలం సైనిక వ్యూహంగానే ఉంది. ఇందులో దౌత్యపరమైన అంశాల గురించి ఆలోచించలేదు. గతంలో అప్పటి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు ఈ ప్రతినిధి ఆయనను కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌ గురించి ప్రశ్నించగా... అది కేవలం సైనిక డాక్ట్రిన్‌ మాత్రమేనని, విదేశాంగ శాఖకు ఇందులో ప్రమేయం లేదని ఆయన సమాధానమిచ్చారు.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 04:35 AM