Share News

Airport Rules: విమానాల టేకాఫ్‌ సమయంలో ఫొటోలు వీడియోలపై నిషేధం

ABN , Publish Date - May 25 , 2025 | 04:12 AM

విమానాశ్రయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని డీజీసీఏ నిషేధిస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రయాణ సమయంలో కిటికీ షేడ్స్ మూసివేయాలని, పలు విమాన దశల్లో ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

Airport Rules: విమానాల టేకాఫ్‌ సమయంలో ఫొటోలు వీడియోలపై నిషేధం

పౌర విమాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వు

న్యూఢిల్లీ, మే 24: పలు విమానాశ్రయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. కిటికీ షేడ్స్‌ మూసే ఉంచాలంటూ పేర్కొంది. రక్షణ శాఖ విమానాశ్రాయాల నుంచి... ప్రధానంగా పశ్చిమ సరిహద్దుల్లోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే క్రమంలో ఈ నిబంధనలను తూచాతప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేసింది. విమానం బయలుదేరి, 10 వేల అడుగుల ఎత్తుకు చేరే వరకూ ప్రయాణికులు తమ కిటికీ షేడ్స్‌ మూసి ఉంచాలని పేర్కొంది. అలాగే విమానం దిగేక్రమంలో 10 వేల అడుగుల ఎత్తు నుంచి విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యి ప్రయాణికుల టెర్మినల్‌ను చేరే వరకూ ‘షేడ్స్‌’ తెరవకూడదని స్పష్టం చేసింది. అలాగే టెర్మినల్‌లో ఉన్నప్పుడు, రన్‌వైపై ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు, విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకూడదని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:12 AM