Court Lockup: కోర్టు లాకప్‌లో దారుణం.. ఖైదీని చంపిన మరో ఖైదీ..
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:02 PM
Saket Court Clash: గురువారం ఢిల్లీ పోలీసులు కొంతమంది అండర్‌ట్రయిల్ ఖైదీలను సాకేత్ కోర్టుకు తీసుకువచ్చారు. వారిలో జితేందర్, అమన్‌లు కూడా ఉన్నారు. ఆ ఖైదీలందరినీ సాకేత్ కోర్టు లాకప్‌లో ఉంచారు.
పగలు, ప్రతీకారాల కారణంగా చరిత్రలో మారణహోమాలు ఎన్నో జరిగాయి. 21వ శాతాబ్ధంలోనూ పగలు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. కొంతమంది కఠిన శిక్షలకు కూడా ఏ మాత్రం భయపడ్డం లేదు. తాజాగా, ఓ ఖైదీ మరో ఖైదీ ప్రాణాలు తీశాడు. అది కూడా కోర్టు లాకప్‌లో ప్రత్యర్థి పీక కాలితో తొక్కి మరీ చంపేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన జితేందర్, అమన్‌లకు మధ్య గత కొన్నేళ్ల నుంచి వివాదాలు నడుస్తున్నాయి. 2024లో జితేందర్, అతడి సోదరుడిపై అమన్ దాడి చేశాడు. ఇద్దర్నీ కత్తితో పొడిచాడు. అదృష్టం బాగుండి ఇద్దరూ ఆ కత్తి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక, అప్పటినుంచి జితేందర్.. అమన్‌పై పగ పెంచుకున్నాడు. అమన్‌పై పగ సాధించడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం జితేందర్, అమన్‌లు ఓ కేసులో జైలు పాలయ్యారు.
గురువారం ఢిల్లీ పోలీసులు కొంతమంది అండర్‌ట్రయిల్ ఖైదీలను సాకేత్ కోర్టుకు తీసుకువచ్చారు. వారిలో జితేందర్, అమన్‌లు కూడా ఉన్నారు. ఆ ఖైదీలందరినీ సాకేత్ కోర్టు లాకప్‌లో ఉంచారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న జితేందర్ కోర్టు లాకప్‌లో అమన్‌పై దాడికి దిగాడు. జితేందర్‌కు జైదేవ్ అనే మరో వ్యక్తి కూడా సాయం చేశాడు. జితేందర్, జైదేవ్‌లు కలిసి అమన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. ఆ తర్వాత జితేందర్ తన కాలితో అమన్ పీక నొక్కి చంపేశాడు. అమన్ హత్యతో కోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఇవి కూడా చదవండి
చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు
గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లో రాఫెల్ విడిభాగాల తయారీ..