Share News

Delhi Baba: షేక్‌ కోసం అమ్మాయి కావాలి

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:37 AM

నుదుటన అడ్డ నామాలతో కాషాయ వస్త్రాల్లో కనిపించే 62 ఏళ్ల ఢిల్లీ బాబా అలియాస్‌ స్వామి చైతన్యానంద సరస్వతి 17 మంది పీజీ విద్యార్థినులపై తీవ్ర లైంగిక..

Delhi Baba: షేక్‌ కోసం అమ్మాయి కావాలి

  • ఆయనకు సెక్స్‌ పార్ట్‌నర్‌గా నీ క్లాస్‌మేట్స్‌లో ఎవరైనా ఉన్నారా?

  • ఓ పీజీ విద్యార్థినితో వాట్సాప్‌ చాటింగ్‌లో ఢిల్లీ బాబా

  • అతడి గదిలో అశ్లీల వీడియోలు.. మోదీ, ఒబామాతో దిగినట్లు ఫేక్‌ ఫొటోలు

న్యూఢిల్లీ, అక్టోబరు 1: నుదుటన అడ్డ నామాలతో కాషాయ వస్త్రాల్లో కనిపించే 62 ఏళ్ల ‘ఢిల్లీ బాబా’ అలియాస్‌ స్వామి చైతన్యానంద సరస్వతి 17 మంది పీజీ విద్యార్థినులపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో ఆశ్రమం నడుపుతున్న ఈ ఢిల్లీ బాబా భాగోతమంతా ఇటీవలే రట్టయింది. శృంగేరీ పీఠానికి అనుబంధంగా నిర్వహిస్తున్న శారదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ అనే విద్యాసంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఢిల్లీ బాబా అక్కడ డిప్లొమా కోర్సులో పీజీ చేస్తున్న 32 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినుల్లో 17మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత ఆగస్టులో బాధిత విద్యార్థునులు పోలీసు స్టేషన్‌ మెట్లెక్కారు. విచారణలో భాగంగా ఆ బాబా వాట్సాప్‌ చాటింగ్‌ జాబితా పరిశీలించి పోలీసులే షాకయ్యారు. ఓ విద్యార్థినితో మాటలు కలిపిన బాబా.. ‘‘ఓ దుబాయ్‌ షేక్‌ కోసం శృంగార భాగస్వామి కావాలి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగాడు. ఆ యువతి.. ‘‘నాకు తెలియదు’’ అని చెప్పగా.. ‘‘నీ క్లాస్‌మేట్స్‌లో గానీ, జూనియర్లలో గానీ ఎవ్వరూ లేరా?’’ అని ఆరా తీశాడు. మరో అమ్మాయిని.. ‘‘స్వీటీ బేబీ.. నేనిప్పుడు డ్యాన్‌ చేస్తున్నాను. నాతో కలిసి డ్యాన్స్‌ చేస్తావా?’’ అని అడిగాడు. మరో అమ్మాయితో.. ‘‘నాతో పడుకోవా?’’ అంటూ అడిగాడు. తన గదికి వచ్చి చెప్పినట్లు వింటే విదేశాల్లో తిప్పుతానని.. ఖర్చులన్నీ తానే భరిస్తానని ఆఫర్‌ చేసేవాడని చాటింగ్‌లోని విషయాల ద్వారా తేలింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఆగస్టు 4న బాబాపై కేసు పమెదవగా ఈనెల 28న ఆగ్రాలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ బాబా... ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బ్రిటన్‌కు చెందిన ఓ రాజకీయ నేతతో కలిసి దిగినట్లుగా నకిలీ ఫొటోలు సృష్టించాడు. ఈ ఫొటోలతో పాటు, కొన్ని అశ్లీల చిత్రాల సీడీలను, సెక్స్‌ టాయ్స్‌ను ఢిల్లీలోని బాబా ఆశ్రమం గదినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబాకు సంబంధించి 8కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశారు. కాగా బాబా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, విద్యాసంస్థ నుంచి తొలగిస్తున్నట్లు శృంగేరీ పీఠం ప్రకటించింది.

Updated Date - Oct 02 , 2025 | 03:37 AM