Share News

CRPF: ఉపరాష్ట్రపతి భద్రత బాధ్యత సీఆర్‌పీఎ్‌ఫకు

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:03 AM

ఉపరాష్ట్రపతి భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్‌ దళం సీఆర్‌పీఎ్‌ఫ కు అప్పగించారు...

CRPF: ఉపరాష్ట్రపతి భద్రత బాధ్యత సీఆర్‌పీఎ్‌ఫకు

  • ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో చర్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఉపరాష్ట్రపతి భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్‌ దళం (సీఆర్‌పీఎ్‌ఫ)కు అప్పగించారు. ఇకపై సీఆర్‌పీఎఫ్‌ సాయుధ దళాలు ఉపరాష్ట్రపతికి జెడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించనున్నాయి. ఈ విషయంలో కేంద్ర సాయుధ పోలీసు దళానికి (సీఏపీఎఫ్‌) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఉపరాష్ట్రపతికి దాడుల ముప్పు పొంచి ఉందన్న నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో సెక్యూరిటీ బాధ్యతను ఢిల్లీ పోలీసుల నుంచి సీఆర్‌పీఎ్‌ఫకు బదలాయించారు. బుధవారం నుంచే సీఆర్‌పీఎఫ్‌ బాధ్యత తీసుకుంటుందని సమాచారం. ఇకపై 24 గంటలూ ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు జడ్‌ ప్లస్‌ రక్షణ కల్పిస్తారు. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీలో 55 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఎస్కార్ట్‌, సహకార సిబ్బంది కూడా ఉంటారు.

Updated Date - Sep 11 , 2025 | 04:03 AM