C.P. Radhakrishnan Takes Oath: నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:46 AM
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీపీ రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.