COVID 19: మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా 257 కేసులు
ABN , Publish Date - May 25 , 2025 | 04:08 AM
దేశంలోని పట్టణాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండగా, కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. ఇది ఇన్‌ఫ్లూయెంజా లాంటి జ్వరం మాత్రమేనని, ఆందోళన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 24: యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అంతా భావిస్తుండగా, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెలలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7 వేరియంట్లు వెలుగు చూశాయని ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం (ఐఎన్‌ఎ్‌సఏసీఓజీ) శుక్రవారం తెలిపింది. ఢిల్లీలో 23 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. ఇది ఇన్‌ఫ్లూయెంజా వంటి జ్వరం మాత్రమేనని ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి పంకజ్ సింగ్ చెప్పారు. కొత్తగా నమోదైన కేసుల్లో 53 శాతం నమూనాల్లో జేఎన్.1 వేరియంట్, 26 శాతం బీఏ.2, 20 శాతం ఇతర ఒమ్రికాన్ వేరియంట్‌లున్నట్లు నిర్ధారించారు. ఈ నెలలో కేరళలో 273 మహమ్మారి కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..