Couple Arrested for Trying to Sell Minor Girl: తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:47 AM
తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టి మరీ పన్నెండేళ్ల బాలికను విక్రయానికి ఉంచిన దంపతులకు బేడీలు పడ్డాయి...
రూ.20 లక్షలకు బాలిక విక్రయానికి యత్నం
దుశ్చర్యకు పాల్పడిన దంపతుల అరెస్టు
బెంగళూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టి మరీ పన్నెండేళ్ల బాలికను విక్రయానికి ఉంచిన దంపతులకు బేడీలు పడ్డాయి. బెంగళూరుకు చెందిన శోభ, తులసికుమార్ దంపతులు మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికను విక్రయానికి ఉంచారు. రూ.20 లక్షలు ఇచ్చినవారికి బాలికను అప్పగిస్తామని వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మైసూరుకు చెందిన ఒడనాడి సేవా సంస్థ ప్రతినిధులు వారిని సంప్రతించారు. తాము రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని, బాలికను మైసూరుకు తీసుకురావాలని సూచించారు. వారు అంగీకరించగానే బెంగళూరులోని విజయనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, సంస్థ ప్రతినిధులు జాయింట్ ఆపరేషన్ చేశారు. పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.