Cotton Worker: పత్తి తీతలో ప్రకాశ్‌రావు కూలీ నం.1
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:54 AM
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన ఇనుముక్కల ప్రకాశ్‌రావు ...
పిడుగురాళ్ల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన ఇనుముక్కల ప్రకాశ్‌రావు (43) ఒక వ్యవసాయ కూలీ. పత్తి తీతలో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన్ను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదు! ప్రస్తుత పనుల్లో ఇతర కూలీలు రోజుకు 60-70 కేజీల వరకు పత్తిని తీస్తుంటే.. ప్రకాశ్‌రావు మాత్రం 150 కేజీల వరకు తీస్తూ శభాష్ అనిపించుకున్నారు. కేజీకి రూ.12 చొప్పున రోజుకు కూలి రూ.1,500 నుంచి రూ.1,800 సంపాదిస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయానని, ఆ కష్టం తన బిడ్డలు పడకూడదనే ఉద్దేశంతో.. కూలీ పనుల్లో ఎక్కువ కష్టపడుతున్నానని చెబుతున్నారు. తనకు ముగ్గురు కుమార్తెలని, పెద్దమ్మాయి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా.. రెండో అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం, మూడో అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలిపారు.