Share News

Corporate Donations Pour into BJP: బీజేపీపై కార్పొరేట్ల విరాళాల వర్షం

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:33 AM

దేశంలో ఎన్నికల బాండ్ల రద్దు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2024-25లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి...

Corporate Donations Pour into BJP: బీజేపీపై కార్పొరేట్ల విరాళాల వర్షం

  • 2024-25లో రూ.3,112.34 కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నికల బాండ్ల రద్దు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2024-25లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి. వివిధ పారిశ్రామిక సంస్థలు నిధులిచ్చే తొమ్మిది ఎలక్టోరల్‌ ట్రస్టుల నుంచి ఆయా పార్టీలు మొత్తంగా రూ.3,811 కోట్లు అందుకోగా.. కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీయే.. సింహభాగం రూ.3,112.34 కోట్లు (82ు) దక్కించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) వివిధ ట్రస్టులు సమర్పించిన నివేదికల ప్రకారం.. మొత్తం విరాళాల్లో ప్రతిపక్ష కాంగ్రె్‌సకు కేవలం రూ.299 కోట్లు (8ు) వెళ్లగా.. ఇతర పార్టీలన్నీ కలిపి రూ.400 కోట్లు (10ు) పొందాయి. వీటిలో టీఎంసీకి రూ.102 కోట్లు, వైసీపీకి రూ.98 కోట్లు, టీడీపీకి రూ.44 కోట్లు, బీజేడీకి 15 కోట్లు, బీఆర్‌ఎస్‌, డీఎంకేలకు చెరో రూ.10 కోట్లు విరాళంగా లభించాయి. 2024-25లో ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు ఒక్కటే బీజేపీకి రూ.2,180 కోట్లు విరాళాల రూపంలో అందించి.. అతిపెద్ద దాతగా నిలిచింది. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు పలు కంపెనీల నుంచి రూ.914 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళంగా సమకూర్చగా.. అందులో రూ.757 కోట్లు (80 శాతం) బీజేపీకే వెళ్లాయి. హైదరాబాద్‌కు చెందిన హెటిరో డ్రగ్స్‌ బీజేపీకి రూ.15 కోట్లు విరాళం ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో 19 ఎలక్టోరల్‌ ట్రస్టులు నమోదై ఉండగా.. శనివారం నాటికి 13 ట్రస్టుల విరాళాల నివేదికలు ఈసీ వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిలో 9 ట్రస్టులు రూ.3,811 కోట్ల విరాళాలను పార్టీలకు అందించాయి. ఇవి 2023-24లో రూ.1,218 కోట్లు ఇవ్వగా.. 2024-25లో 3రెట్లు పెరగడం గమనార్హం. ఇదే కాలంలో నాలుగు ట్రస్టులు... జన్‌హిత్‌, పరిబర్తన్‌, జైహింద్‌, జైభారత్‌.. తామెలాంటి విరాళాలూ ఇవ్వలేదని చూపాయి.

Updated Date - Dec 22 , 2025 | 04:33 AM