Tragic Accident: గణేశ్ శోభాయాత్రపైకి దూసుకెళ్లిన కంటెయినర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:59 AM
గణేశ్ నిమజ్జనోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగింది. శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులపైకి మినీ కంటెయినర్ దూసుకువెళ్లింది...
హాసన్ జిల్లాలో 8 మంది మృతి.. పలువురికి గాయాలు
బెంగళూరు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): గణేశ్ నిమజ్జనోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగింది. శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులపైకి మినీ కంటెయినర్ దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు, 20 మందికిపైగా గాయపడ్డారు. హాసన్ జిల్లా మొసళె హొసహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం సిద్దరామయ్య రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.