Share News

Chief Justice Gavai: రాజ్యాంగమే సుప్రీం

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:23 AM

దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలైన న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి...

Chief Justice Gavai: రాజ్యాంగమే సుప్రీం

  • బుల్డోజర్‌ న్యాయం పనిచేయదు

  • సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యలు

అమరావతి (మహారాష్ట్ర), జూన్‌ 26: దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలైన న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన జన్మస్థానమైన అమరావతిలో బుధవారం జరిగిన సన్మానసభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగమే సర్వోన్నతం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మౌలిక స్వరూపం’ తీర్పును ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉందని, పూర్తిగా మార్చివేసే అధికారంలేదని ఆ తీర్పు ద్వారా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పార్లమెంటే సుప్రీం అని కొందరు అంటున్నారని, కానీ తన ఉద్దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన జడ్జి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు కాదన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను కాపాడేలా తాను తీర్పులు ఇచ్చినట్టు జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు. బుల్డోజర్‌ న్యాయానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. నివాస హక్కు సుప్రీం అని, దానిని బుల్డోజర్‌లతో అడ్డుకోలేరని తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 03:24 AM